Kranthi Kiran | సంగారెడ్డి జిల్లా, జనవరి 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తూనే ఉన్నది. సిట్ అధికారులు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, మాజీ మంత్రి హరీష్‌రావుకు, మాజీ ఎంపీ సంతోష్‌రావుకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. నేడు ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.
కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు ఇదే నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ అధికార దుర్వినియోగనికి పరాకాష్ట అని మండిపడ్డారు. పరిపాలన విధివిధానాలు తెలియని వాళ్లు పాలకులుగా ఉండటం దురదృష్టకరమని.. నియంతృత్వ పోకడలకు ప్రజలే అడ్డుకట్టవేస్తారని క్రాంతి కిరణ్ అన్నారు.