Adarsh Reddy | పటాన్ చెరు, ఏప్రిల్ 19 : రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్‌ను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పటాన్ చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి తెలిపారు. ఇవాళ పటాన్ చెరు నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. సాధ్యం కానీ హామీలు ప్రజలకు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా వరంగల్ సభకు వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారన్నారు. ఈ సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని.. ఎన్నికల్లో కల్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్ రెడ్డి, వెంకటేశం గౌడ్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్