Eggs | జహీరాబాద్, నవంబర్ 22 : ఒక వైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవనం చాలా ఖరీదైపోతుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాంసాహారం భుజించలేని సామాన్యులకు గుడ్లు అందుబాటులో ఉండేవి. కానీ గుడ్డు ధర ఉన్నట్టు ఉండి అమాంతంగా పెరిగి పోతుండడంతో చికెన్ ధరలకు చేరుకుంటుంది.
పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు వ్యాధులు సోకడం, ఇటీవల తుఫాన్ ప్రభావం వల్ల రోజు రోజుకు కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఏకంగా ఏడు రూపాయలు దాటిపోగా, హోల్సేల్ మార్కెట్లలోనూ ధరలు ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఇదివరకు కోడిగుడ్డు రిటైల్ ధర గత కొన్ని రోజుల కింద రూ.5 నుంచి రూ.6.50 వరకు ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ.8కి చేరిపోయింది.
సామాన్యుల దుస్థితి..
గత వర్షాకాలంలో కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు కురిశాయి. కురిసిన అతివృష్టితో కూరగాయలు అంతంత మాత్రమే అందుబాటులోకి వస్తుండడంతో కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కిలో టమోటా రూ.50 కాగా వంకాయలు కిలో రూ.120, బీరకాయలు రూ.100, దొండకాయలు కిలో రూ.80, సోరకాయలు ఒక్కోటి రూ.30 నుంచి రూ.50కు, ఆకుకూరలు ఒక కట్ట రూ.20 నుంచి రూ.30కి విక్రయిస్తున్నారు.
కూరగాయల ధరలతో సమానంగా కోడిగుడ్డు ధర పెరగడంతో సామాన్యుల పరిస్థితి అగమ్య ఘోచరంగా మారింది. శాఖాహారం తినాలన్న ఆకాంక్షను తగ్గించుకోవడంతోపాటు గుడ్డు ధర కూడా పెరిగిపోవడంతో చికెన్ కొనుక్కుంటే మేలని ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న కూరగాయలు, గుడ్ల ధరలతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dharmaram | ధర్మారం అయ్యప్ప స్వామి ఆలయంలో భిక్షా కార్యక్రమం ప్రారంభం
Smog | కుభీర్ను కమ్మేసిన పొగ మంచు.. ఇబ్బందుల్లో గ్రామస్థులు
Local Body Elections | స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం