Illegal Constructions | రామచంద్రాపురం, ఏప్రిల్ 27 : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్ గ్రామంలో ఉన్న బీమ్యాక్ సైబర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కాలనీవాసులు నిరసన చేపట్టారు. ప్లకార్డ్‌లను పట్టుకొని బీమ్యాక్ కాలనీ నుంచి ప్రధాన గేట్ వరకు ర్యాలీగా వచ్చి అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ఆమోదించిన లేఅవుట్ ప్రకారం వాణిజ్య సముదాయానికి కేటాయించిన స్థలాన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కాలనీ సొసైటీ అధ్యక్షుడు, సొసైటీ బాడీతో సంప్రదించకుండా ఎలాంటి ఎన్వోసీ, అనుమతులు లేకుండా నిర్మాణం కొనసాగిస్తున్నారని చెప్పారు. కాలనీ ఎస్టీపీ నిర్వహణ బాధ్యత కాలనీ మెయింటెనెన్స్ కమిటీకి ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు 5 అంతస్తుల అపార్ట్మెంట్ డ్రైనేజీని కాలనీ డ్రైనేజీ లైన్‌కి కలుపడం జరిగిందన్నారు. కాలనీకి చెందిన కమర్షియల్ స్థలంలో బహుళంతస్తుల నిర్మాణాలు జరుగనివ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి