CITU | పటాన్ చెరు, నవంబర్ 1: కార్మికులు ఐక్యంగా ఉండి తమ సమస్యల సాధన కోసం పోరాటం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు కే రాజయ్య, సీఐటీయూ కార్యదర్శి జి సాయిలు , యూనియన్ అధ్యక్షుడు అతిమేల మాణిక్ తెలిపారు. శనివారం సాయంత్రం పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు.
చట్టబద్ధంగా ప్రజాస్వామ్య యుతంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్న బిస్లరీ కార్మికులకు అభినందనలు తెలియజేశారు. కార్మికుల భద్రత సంక్షేమం సీఐటీయూ లక్ష్యం అన్నారు. కార్మికుల హక్కుల కోసం రాజులేని పోరాటాలు సీఐటీయూ నిర్వహిస్తుందని అన్నారు. కార్మికుల సమస్య పరిష్కారానికి బిస్లరీ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తూ యూనియన్ తో చర్చలు జరపడానికి ముందుకు రావాలని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు యాజమాన్యం మానుకోవాలని అన్నారు.
చట్ట విరుద్ధంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే పోరాటాలు తప్పదని అన్నారు.. కార్మికులు ఐక్యంగా తమ న్యాయమైన డిమాండ్లకు సాధనకు పోరాడాలని అన్నారు. బిస్లరీ కార్మికులకు అండగా సీఐటీయూ జెండా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఎన్ శేఖర్ రెడ్డి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు శాంత కుమార్, రాజు , సుధాకర్, నాయకులు వెంకటేష్, సంతోష్ గౌడ్, రోషన్, లకన్ మల్లేష్ జైపాల్ చంద్రయ్య బిస్లరి యూనియన్ నాయకులు నాగరాజు ప్రవీణ్ గౌడ్, కృష్ణకుమార్ అజయ్ ఠాకూర్ సతీష్ గౌడ్ నవీన్ బిస్లరీ కార్మికులు కిర్బీ, సెనర్జీ, సువెన్ ఫార్మా, హింజల్, యూనియన్ల నాయకులు. సీఐటీయూ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Actress | భిక్షాటనతో జీవనాన్ని సాగిస్తున్న నటి.. కంటతడి పెట్టిస్తున్న నుపుర్ అలంకార్ కథ
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో మరో ట్విస్ట్ .. శ్రీజ ఎలిమినేషన్, కొత్త కెప్టెన్గా దివ్య!
NTR | గాయాల నుండి పూర్తిగా కోలుకున్నఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ భారీ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..!