గుమ్మడిదల,మే12: జిల్లాలోని సుప్రసిద్ధశైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయంలో వైశాఖమాసం పౌర్ణమిని పురస్కరించుకుని చండీహోమాన్ని వైభవంగా నిర్వహించారు. గుమ్మడిదల మున్సిపాల్ పరిధిలోని బొంతపల్లిలోని వీరభద్రస్వామిదేవాలయంలో సోమవారం శివుడి ప్రీతికరమైన రోజు కావడంతో వీరభద్రస్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భద్రకాళీ అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ఈవో శశిధర్‌గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమయ్య, ధర్మకర్తల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలతో చండీహోమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Boy Killed By Mother’s Lover | బాలుడ్ని హత్య చేసిన తల్లి ప్రియుడు.. సూట్‌కేస్‌లో మృతదేహం
KTR | అందాల పోటీల్లో ముఖ్యమంత్రి.. ధాన్యం కుప్పలపైనే అన్నదాత బలి : కేటీఆర్
Telangana people | సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి 162 మంది తెలంగాణ వాసులు