Telangana people : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) కు చెందిన ప్రజలు కూడా స్వస్థలాలకు బయలుదేరారు. ఇవాళ 162 మంది తెలంగాణ వాసులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో వాళ్లు ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఆ 162 మందిలో 56 మంది జమ్ముకశ్మీర్‌లోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారు కాగా.. మిగతా 106 మంది పంజాబ్‌లో పనిచేస్తున్న వారని అధికారులు తెలిపారు. ఇప్పటికే 130 మంది తమ స్వస్థలాలకు చేరుకున్నారని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే మిగతా తెలంగాణ ప్రజలకు కూడా ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించి ఆ తర్వాత సొంతూళ్లకు పంపుతామని అన్నారు.