BRS Party | పటాన్చెరు, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్ సభ సక్సెస్ కావడంతో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు పటాన్చెరు నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. బీఆర్ఎస్ నేతలు వేసిన అంచనాలకు మించి ప్రజలు సభకు వెళ్లడంతో పటాన్చెరులో పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గ ముఖ్యనాయకులతో పలు మార్లు సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ సభకు నాయకులు, కార్యకర్తల తరలింపు కోసం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలం నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు ముఖ్య నాయకులు కృషి చేశారు.
బీఆర్ఎస్ బహిరంగ సభకు జనాలను తరలించేందుకు నియోజకవర్గ ఇంచార్జీ ఆదర్శరెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కొలను బాల్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు వెంకటేశం గౌడ్, సోమిరెడ్డితోపాటు పలువురు నియోజకవర్గంలో పర్యటించి నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేశారు.
పటాన్చెరులో ఫలించిన హరీశ్‌రావు కృషి..
పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రతీ రోజు నియోజకవర్గంలో ఉన్న ముఖ్యనాయకులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ ఇంచార్జీ ఆదర్శరెడ్డి బీరంగూడ కమాన్ నుంచి రుద్రారంలో ఉన్న గణేష్ మందిర్ వరకు పాదయాత్ర చేసి మందిర్‌లో ప్రత్యేక పూజలు చేసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
రుద్రారంలో నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
ప్రతీ గ్రామంలో పార్టీ జెండాలు అవిష్కరణలు చేసి, బీఆర్ఎస్ అవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పండగలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పటాన్చెరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్యకర్తలను చైతన్యం చేశారు. దీంతో నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు అనుకున్న దాని కంటే అధికంగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
ఎక్కడ చూసినా గులాబీ జెండాలు ..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు అంతగా వెళ్లకపోవచ్చని ప్రతీ ఒక్కరు అంచన వేశారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు మించి పటాన్చెరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిపోవడంతో జోరుగా చర్చ జరుగుతుంది. పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన గూడెం మహిపాల్‌రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అయిపోయింది.. అనుకోనే సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ వరంగల్ సమీపంలో ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివెళ్లడం జరిగింది.
ఆదివారం పటాన్చెరులో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు కనిపించాయి. నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిపోవడంతో పార్టీకి పూర్వవైభవం వచ్చిందని నాయకులు, కార్యకర్తలు సంతోషంతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థులు, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టిపోటి ఇవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు పట్టుదలతో పని చేయడంతో బీఆర్ఎస్ సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించారు.
కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నరు : వెన్నవరం ఆదర్శరెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జీ
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకి రాని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభకు హాజరు కావడం జరిగింది. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్చందంగా రావడం జరిగింది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చి హామీలను అమలు చేయడంలో ఫెయిల్ కావడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రజలు మరోసారి కేసీఆర్‌ను సీఎం కావాలని కోరుకుంటున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, భారతీనగర్, పటాన్చెరు కార్పోరేటర్ డివిజన్లు, తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలు, జిన్నారం, గుమ్మడిదల, పటాన్చెరు, మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు భారీ సంఖ్యలో సభకు తరలివచ్చి విజయవంతం చేశారని ఆదర్శరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Migratory birds | పెరుంగులమ్ రిజర్వాయర్‌లో వలస పక్షుల సందడి.. Video
Mission Bhageeratha | మిషన్ భగీరథపై నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపే లేదు
PVNR Expressway | పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై రెండు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్