MLA Chinta Prabhakar | కొండాపూర్, ఏప్రిల్27 : అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఇవాళ జరుగనున్న రజతోత్సవ సభకు కొండాపూర్ మండలం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలి వెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ జెండాను అవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డిలో ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించి ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఎంతగానో శ్రమించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణపై సభలో దిశానిర్దేశం చేస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీఆర్ఎస్ సిద్దంగా ఉందని, బీఆర్ఎస్ను ఆశీర్వదించడానికి ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మ్యాకం విఠల్, కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, సొసైటి చైర్మన్ పవన్‌కుమార్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షులు రుక్మోద్దీన్, రాంచందర్, వైస్ ఎంపీపీ లక్షీరాంచందర్, మాజీ మండల రైతు బంధు సమితి అధ్యక్షులు పట్లోళ్ల మల్లేశం, మాజీ సర్పంచ్‌లు షఫీ, నర్సింహులు, ఫయిం, సంగారెడ్డి, మాణయ్య, నాయకులు మల్లాగౌడ్, అనిల్, ఇంద్రారెడ్డి, అరవింద్‌రెడ్డి, జలీల్, రఘునాథ్‌రెడ్డి, అంజీరెడ్డి, రవి, ప్రేమనందం, సంతోష్‌రెడ్డి, ప్రకాశం, రాజాగౌడ్, వీరేశం, దేవెందర్, రాందాస్, నగేష్, వెంగళ్‌దాస్ విఠల్, వినోద్, సాజీద్, సద్దాం, తదితరులు పాల్గొన్నారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి