BRS leaders | సిద్దిపేట, ఏప్రిల్20: బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో రజతోత్సవ సభకు ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కోసం మేము సైతం అంటూ గట్ల మల్యాల గ్రామ బీఆర్ఎస్ నాయకులు కూలీ పనులు చేశారు. ఇవాళ గట్ల మల్యాల గ్రామానికి చెందిన రైతులు బుద్ది తిరుపతి, పుట్ట మధుకర్ల పొలంలో బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ పనులు చేశారు.
ఇందుకుగాను రైతులు బుద్ది తిరుపతి, పుట్ట మధుకర్ బీఆర్ఎస్ నాయకులకు కూలీగా రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రేణుక వేణుగోపాల్, బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రబాబు, నాయకులు వీర్య నాయక్, ప్రకాష్ రెడ్డి, వెంకటయ్య, శ్రీనివాస్, వెంకటేష్, తిరుపతి, బిక్షపతి, పరశురాములు, రాజు, కోటయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?