BRS Party | కోహీర్, జూన్ 8 : కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే సెక్యులర్ పార్టీ అని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కోహీర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో వారు మాట్లాడారు. గత సీఎం కేసీఆర్ హయాంలో ముస్లిం నేతలకు అనేక పదవులను ఇచ్చి గౌరవించారని వారు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క ముస్లిం నేతకు పదవి ఇవ్వలేదని విమర్శించారు.
సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పని తీరు అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వని కాంగ్రెస్లో ఒక్క ముస్లిం కూడా ఉండొద్దని సూచించారు. నిజమైన సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్లోకి రావాలని కోరారు. ఈ సమావేశంలో సందీప్, దినకర్, అస్లాం, వాజీద్, తదితరులున్నారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్భవన్లో ప్రమాణస్వీకారం పూర్తి