MLA Manikrao | ఝరాసంగం, జూలై 9 : జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మండల అధ్యక్షుడు వెంకటేశం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఎమ్మెల్యే మాణిక్ రావు నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండి నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలందించాలని కోరుతూ ఆయన పేరుతో ప్రత్యేక పూజలతో స్వామి వారికి అభిషేకం, మంగళహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అవరణలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని చర్చి ఆవరణలో మొక్కలు నాటి నీరు పోసి హరితహారానికి మద్దతుగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ అధ్యక్షుడు తట్టు నారాయణ, మొగుడంపల్లి అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, కేతకీ మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, ఝరాసంగం పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ బాబా, నాయకులు సంగమేష్ పటేల్, బసవరాజు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, మాణిక్యం యాదవ్, దేవిపుత్ర, బాబుమియా, అశోక్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం