Train Fecility | రామచంద్రాపురం,సెప్టెంబర్ 28 : రైల్వే స్టేషన్ల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను కోరారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులనాగలాపల్లి రైల్వే స్టేషన్ లో కేంద్ర సహాయ మంత్రి సోమన్నను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాగులపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద పబ్లిక్ అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని, ఆర్సీ పురం నుండి జహీరాబాద్ రైల్వే లైన్ లో పలు చోట్ల పీఓపీ నిర్మాణం చేయాలన్నారు. నాగులపల్లి రైల్వే స్టేషన్ వద్ద లెవెల్ క్రాసింగ్ గేట్లు చాలా టైం పాటు క్లోజ్ చేస్తున్నారని, దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
ప్రమాదకరంగా ఉన్న రైల్వే గేట్స్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మించాలన్నారు. అంతే కాకుండా నాగులపల్లి రైల్వే స్టేషన్ నుంచి తెల్లాపూర్ వరకు 1 కి.మీ మేర రోడ్డు కనెక్టివిటీతోపాటు ప్రయాణికుల కోసం జహీరాబాద్ స్టేషన్లో రైల్వే పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి ఎక్స్ప్రెస్ ను జహీరాబాద్ వద్ద స్టాప్, అలాగే జహీరాబాద్ నుంచి ముంబై వరకు డైరెక్ట్ ట్రైన్ సదుపాయాలు కల్పించాలని ఆమె కేంద్ర సహాయ మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దేశ్ పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంషాబాద్ రాజు, వెంకట నర్సింహా రెడ్డి, అనంత్ రావు, కులకర్ణి, తెల్లపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం