Basaveshwara Statue | ఝరాసంగం, మే 18 : పన్నెండవ శతాబ్ధంలోనే బసవేశ్వరుడు కుల, వర్ణ, లింగ వివక్ష లేని సమసమాజ స్థాపనకు కృషి చేశారని, ప్రతీ ఒక్కరూ ఆ మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు.
ఇవాళ మండల పరిధిలోని మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర సిద్దేశ్వరానందగిరి మహారాజ్, ధనశ్రీ పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య, చిలేపల్లి బసవలింగ అవధూతగిరి మహారాజ్ మల్లన్న, రంజోల్ మఠం రాచయ్య స్వామిలు వేద మంత్రోచ్ఛరణాల మధ్య ఆవిష్కరించారు.
పీఠాధిపతులు, నాయకులను ఉత్సవ కమిటీ సభ్యులు పూలమాలలు, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పాటిల్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, ఝరాసంగం పట్టణాధ్యక్షుడు ఏజాజ్ బాబా, కేతకీ ఆలయ మాజీ చైర్మన్లు నీలా వెంకటేశం, నర్సింహాగౌడ్, మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, ప్రభు పాటిల్, సంగమేశ్వర్, నాయకులు నరేష్, సంగమేశ్వర్ పాటిల్, గాలయ్య, తీన్మార్ నర్సింలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్