GHMC | పటాన్చెరు, మే 16 : జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, రామచంద్రపురం కార్పొరేట్ వార్డులో బార్లు ఏర్పాటు చేసేందుకు అసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి సీ నవీన్‌చంద్ర, పటాన్చెరు ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో పరమేశ్వర్ గౌడ్లు ఓ ప్రకటనలో తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మూతపడిన, రెన్యూవల్ కాని బార్ల స్థానంలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వం బార్లకు నోటిఫికేషన్ జారీ చేసిందని, అసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిప్యూటి కమీషనర్ కార్యాలయం సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కమీషనర్ కార్యాలయం హైదరాబాద్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
దరఖాస్తు చేసుకునే వారు మూడు ఫొటోలు, రూ.లక్ష డీడీ తీసుకొని సమర్పించాలని..ఆధార్, పాన్‌కార్డు దరఖాస్తుకు జత చేయాలన్నారు. జూన్ 13న ఎక్సైజ్ కమీషనర్ హరికిషన్ సమీక్షలో డ్రా తీస్తామన్నారు.
Read Also :
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం