Students | సంగారెడ్డి : మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూసింది. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో కడుపునొప్పితో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను నారాయణ ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించింది.
డాక్టర్లు విద్యార్థులకు చికిత్సనందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై విద్యా, వైద్య అధికారులు విచారణ ప్రారంభించారు. విద్యార్థులను ఇదే విషయమై అడుగగా.. ఆ రోజు తొట్టెల కార్యక్రమం ఉండే. అక్కడి నుంచి గరం చేసుకుని తీసుకొచ్చి మాకు పెట్టిర్రు అని ఓ విద్యార్థి చెప్పాడు. ఏం తిన్నరని మరో విద్యార్థినిని అడిగితే.. పప్పు చారు అని.. దావత్లకెళ్లి తీసుకొచ్చి పెట్టిన్రని చెప్పింది.
టీచర్ తన మనవడిని ఇంటికి తీసుకెళ్లి చారు తీసుకొచ్చిందంటూ ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజనం పట్ల స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం ఎలా ఉందో తాజా ఘటన అద్దం పడుతోంది.
బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజనం తిని 23 మంది విద్యార్థులకు అస్వస్థత
నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన
ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురైన విద్యార్థులు
అప్రమత్తమై విద్యార్థులను వెంటనే నారాయణఖేడ్… pic.twitter.com/x7ihmmpPrX
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2026