100 days action plan | జహీరాబాద్, జూన్ 2 : జహీరాబాద్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులను చేపట్టేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం 51 యాక్టివిటీస్ ఉన్నాయన్నారు.
ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు యాక్టివిటీస్ నిర్వహించబడతాయన్నారు. అందులోభాగంగా ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ పరమైన పనులు, పెద్ద మురికి కాలువలు, నాళాలు, సోషల్ మీడియా క్యాంపెయిన్, పడి పడి చెత్తలపై ఇంటింటికి అవగాహన సమావేశాలు, వాల్ పెయింటింగ్స్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, దోమల నివారణ, పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్స్, ర్యాలీలు నిర్వహింస్తామన్నారు.
మురికి కాలువ, నాలాలపై మెష్ ఏర్పాటు..
స్వచ్ఛత కాంపిటీషన్స్, అవార్డులు, క్విజ్ కాంపిటీషన్స్, పెయింటింగ్స్, రంగోలి కాంపిటీషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, భువన్ సర్వే, ట్రేడ్ లైసెన్స్ గుర్తించుట, ఇంటి నల్ల కనెక్షన్లను ఆన్లైన్ చేయుట, మహిళా సంఘాల ప్రోడక్ట్ మేలా, స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్, వీధివిక్రయదారుల సంఘాలు ఏర్పాటు చేయుట, మహిళా సంఘాల వారికి బ్యాంకు లింకేజీ ఇచ్చుట, స్ట్రీట్ వెండింగ్ జోన్లను సమీక్షించుట, కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేయుట, ఓవర్ హెడ్ టాంక్స్ శుభ్రం చేయుట, లోతట్టు ప్రాంతాలు పూడ్చుట, ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం, శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించడం, మురికి కాలువ, నాళాలపై మెష్ ఏర్పాటు చేయుట, జంక్షన్స్ అభివృద్ధి చేయుట, యానిమల్ బర్త్ కంట్రోల్ బర్త్ పై క్యాంపెయిన్ నిర్వహించటం, ఇంకుడు గుంతల నిర్మాణం చేయుట, చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి చేయుట, వన మహోత్సవం నిర్వహించుట, ప్రొఫైలింగ్ ఆఫ్ వేస్ట్ పిక్కర్స్, క్లోరినేషన్ టెస్ట్లు నిర్వహించడం మొదలగు పనులను చేస్తామన్నారు.
ఈ వంద రోజులు యాక్షన్ ప్లాన్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో అమలు చేయాలని మరియు ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు ప్రజలందరూ ఇందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి