Indiramma Houses | రామాయంపేట, ఏప్రిల్ 29 : రామాయంపేట పట్టణంలో మేడే 139వ కరపత్రాలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఇవాళ పట్టణంలోని హమాలీ, తాపీ మేస్త్రీల సంఘం కార్మికులు ఏఐటీయూసీ మెదక్ జిల్లా కార్యదర్శి అయ్యవారి లక్ష్మన్ అధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం అయ్యవారి లక్ష్మన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హమాలీలకు తగిన పనికి తగిన కూలీ ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మికులు రోడ్డున పడే విధంగా చట్టాలను మారుస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలను తమ చుట్టాలుగా మార్చవద్దన్నారు. 56 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ప్రభుత్వం నెలకు రూ.6వేల పింఛన్ ఇవ్వాలలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాళం బాలాగౌడ్, శ్రీశైలం, అల్లాడి రాములు, రాజేష్, యాదగిరి, వెంకటేశ్, సరుగు సిద్దరాములు, మర్కు రాములు, భిక్షపతి, శ్రీనివాస్, స్వామి, మద్దూరి రాజు, లింగం తదితరులు ఉన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి