Revenue conferences | రామాయంపేట, జూన్ 05 : రైతుల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. తహసీల్దార్ రజినీకుమారి గురువారం రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్, సదాశివనగర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ప్రారంభించి భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం తహసీల్దార్ రజినీకుమారి మాట్లాడుతూ.. రైతులు తమ భూములకు సంబంధించి సమస్యలను వివరించాలన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, సంజీవరెడ్డి, ఆర్ఐ గౌస్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు