హుస్నాబాద్ టౌన్ జూన్ 5: ఈనెల 6 తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే రైతు మావోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి గురువారం పరిశీలించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న కిసాన్ మేళాలో జరుగుతున్న ఏర్పాట్ల తీరుపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు మహోత్సవ ప్రారంభ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి దాదాపు 6000 మంది రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు, రైతులను కార్యక్రమానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
నూతన విత్తనాలు వ్యవసాయ పనిముట్లు తోపాటు పలు అంశాలను రైతులకు వివరించేందుకు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ మన చౌదరి చెప్పారు. మూడు రోజులపాటు జరిగే రైతు మహోత్సవానికి హాజరవుతున్న రైతుల కోసం భోజన వసతి మంచినీటి వసతితో పాటు మొబైల్ వాష్ రూమ్స్‌ను సగం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డిఓ రామమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏసీపీ సదానందం పాల్గొన్నారు.