గజ్వేల్ : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నీతి అయోగ్, ఏఐఎం ఆధ్వర్యంలో 2024 -25 విద్యా సంవత్సరానికి దేశంలోని అన్ని పాఠశాలల నుండి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహించారు. లక్షకు పైగా పాఠశాలలు ఈ ప్రాజెక్టులో పాల్గొనగా దేశవ్యాప్తంగా 1000 ప్రాజెక్టులను నీతి అయోగ్ ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన ప్రాజెక్టులో గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్ సీబీఎస్ఈ విద్యార్థులు తయారుచేసిన లెడ్ విండ్ మిల్ ఎంపికైనట్లు నీతి అయోగ్ ప్రకటించింది.
విద్యార్థులు తయారుచేసిన ఈ ప్రాజెక్టు వల్ల కరెంటు తగ్గుతుందని ప్రాజెక్టు గైడ్ టీచర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రాజెక్టులో పాల్గొన్న ఆరో తరగతి విద్యార్థులు ధవన్, శ్రావణ్ కుమార్, సాయి నయన్ లను పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి, ప్రిన్సిపల్స్ విజయపాల్ రెడ్డి, రాయప్ప అభినందించారు. దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం డిజైన్ థింకింగ్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నీతి అయోగ్ ప్రకటించింది.