Farmers | మెదక్ రూరల్, జూన్ 12 : వర్షాలు కురుస్తుండంతో ఎరువులు, విత్తనాలను తీసుకెళ్లేందుకు రైతులు బారులు దీరుతున్నారు. సొసైటీలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. మొన్నటి దాకా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేశాయి. ప్రస్తుతం విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి సాగుకు తోడ్పా టునందిస్తున్నాయి. మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి మండలాల రైతులు ఎరువులు, విత్తనాలు తీసుకెళ్తున్నారు.
అర్హత కలిగిన ప్రతీ రైతుకు ఎకరానికి రూ.45 వేల రుణం ఇస్తున్నారు. యూరియా, పాస్పేట్, జింక్, పొటాషియం, సూపర్ సల్ఫేట్, తదితర రకాల ఎరువులు అందుబాటులో ఉంచారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లను ఈ సంఘాల ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్నది. ప్రైవేటు మార్కెట్లు భిన్నంగా నిర్ణీత ధరకే విక్రయిస్తుండడంతో రైతులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వానకాలం పంటలకు సిద్ధంగా ఎరువులు.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యం : హనుమంత్ రెడ్డి-పీఏసీఎస్ చైర్మన్, మెదక్
రైతులకు మెరుగైన సేవలు అం దించేందుకు నిర్ణయించాం. ప్రత్యే క చొరువతో ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా రుణాలు అందస్తున్నాం. ఎరువులు, విత్తనాలు అందు బాటులో ఉంచాం. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్