Praja Palana | శివ్వంపేట, మార్చి 24 : ఇచ్చిన హామీలు అమలుచేయాలని ప్రశ్నిస్తున్న అన్ని రంగాల వారిని అక్రమ అరెస్టులు చేయడమే ప్రజాపాలనా..? అని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహేందర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ ఆశావర్కర్లు హైదరాబాద్ ఛలో కమీషనరేట్ వెళ్తుండగా.. అక్రమంగా ఆశాలను అరెస్టు చేయడాన్ని మహేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం ఖాయమన్నారు. అదేవిధంగా అక్రమంగా అరెస్టు చేసిన ఆశావర్కర్లను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.