Poshana Masam | మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతాయని టేక్మాల్ మండల ఐసీడీసీ సూపర్వైజర్ శ్రీశైలా వెల్లడించారు.
ఈ సందర్భంగా మంగళవారం టేక్మాల్ మండలం ఎల్లుపేట్ సెక్టార్ నల్లకుంట తండా సెంటర్లో పోషణ మాసం నిర్వహించారు. స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. తాజా ఆకుకూరలు, పండ్లలో అనేక పోషక విలువలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా మహిళలలో రక్తహీనత రాకుండా బలమైన పోషకాహారాన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మహిళలకు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిశోర బాలికలు, గర్భిణీలు, తల్లులు, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ , ప్రైమరీ స్కూల్ టీచర్ అనిల్, అంగన్వాడీ టీచర్ కే.సుజాత, ఆయా మంజుల, తదితరులు పాల్గొన్నారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ