Girl Missing case | నర్సాపూర్, జూన్9 : ఇంట్లో నుంచి పారిపోయిన బాలిక ఆచూకిని పోలీసులు గంటలో చేధించారు. ఆ బాలికను తల్లికి అప్పగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సంఘటన నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది.
ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన కాట్రోత్ వసంత భర్త మోహన్ తన కూతురు అగు కాట్రోత్ అక్షి (6)ని సోమవారం కొట్టడంతో బాలిక అలిగి ఇంటి నుండి పారిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ మేరకు గాలింపు మొదలుపెట్టిన కానిస్టేబుల్స్ మోహన్, వెంకన్నఒక గంట వ్యవధిలోనే బాలికను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడం జరిగింది. అనంతం ఎస్సై లింగం బాలిక తల్లిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బాలికను వారికి అప్పజెప్పారు. బాలిక కేసును చేధించిన కానిస్టేబుల్స్‌ను ఎస్సై ప్రశంసించారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..