SI Srinivas Goud | పాపన్నపేట, జూలై 19 : పోలీస్ వ్యవస్థ అనేది సమాజం హితం కోసం పనిచేస్తుందని పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం నో బ్యాగ్ డే పురస్కరించుకొని పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఐ పోలీస్ సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన అన్ని విభాగాల గురించి, వారి విధుల గురించి వివరించారు. ఫిర్యాదుదారులు వస్తే ఎలా వ్యవహరిస్తారు.. ఎస్ఐ విధులు ఎన్ని రకాలుగా ఉంటాయి. పోలీస్ వ్యవస్థ సమాజం కోసం ఎలా పని చేస్తుంది తదితర విషయాల గురించే కాకుండా సైబర్ నేరాల నుండి ఎలా రక్షించు కోవాలి..? రోడ్డు ప్రమాదాల పాడిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. తదితర విషయాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.
ఈ కార్యక్రమంలోఇంచార్జి హెచ్ఎం వెంకటేశం, ఉపాధ్యాయులు, అంజా గౌడ్, ప్రవీణ్, భట్టు నాగరాజు, నింగప్ప, మోహన్ రావు, రమేష్ , శ్రీహరి , శ్రవణ్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత