Petrol Bunks | అప్పటిదాకా నడిచిన పెట్రోల్ బంకుల్లో సడెన్గా ‘నో స్టాక్ బోర్డు’లు
Petrol Bunks | టీఎస్ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్.. అలాగే సంగారెడ్డి మార్గంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులను బంకు నిర్వాహకులు గురువారం బంద్ చేశారు. మధ్యాహ్నం వరకు నడిపించిన బంకులను ఒక్కసారిగా మూసివేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Petrol Bunks | నర్సాపూర్, మార్చి26 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సంపూర్ణంగా ఉన్నాయని ఓ వైపు ప్రభుత్వం చెబుతున్నా.. మరోవైపు నర్సాపూర్లో మాత్రం పెట్రోల్ బంకులను నిర్వాహకులు బంద్ చేశారు. వివరాల్లోకి వెళ్ళితే నర్సాపూర్ పట్టణంలోని హైదరాబాద్ మార్గంలో గల టీఎస్ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్.. అలాగే సంగారెడ్డి మార్గంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులను బంకు నిర్వాహకులు గురువారం బంద్ చేశారు.
మధ్యాహ్నం వరకు నడిపించిన బంకులను ఒక్కసారిగా మూసివేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో గల పెట్రోల్ బంక్లో ఏకంగా నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. వీటిపై బంకు నిర్వాహకులను వివరణ కోరగా.. పెట్రోల్, డీజీల్ స్టాక్ అయిపోయిందని తిరిగి గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం వస్తుందన్నారు.
ఈ క్రమంలో బంకులకు వచ్చిన వాహనదారులు పెట్రోల్, డీజీల్ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. నిజంగానే పెట్రోల్, డీజీల్ అయిపోయిందా లేక కృత్రిమ కొరత సృష్టించడానికి బంకు యాజమాన్యం ఇలా చేస్తుందా..? అని పలువురు ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసిల్దార్ శ్రీనివాస్ను వివరణ కోరగా.. ప్రభుత్వం వద్ద స్టాక్ పుల్గా ఉందని.. బహుశా పెట్రోల్ బంక్ వారు బుక్ చేసుకోలేదేమోనని అన్నారు. దీని గురించి విచారణ చేపడతామని తెలిపారు.

Read Also :
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

