Sanitation Works | రామాయంపేట, ఏప్రిల్ 30 : రామాయంపేట మండలంలోని రాయిలాపూర్, సుతారిపల్లి, ఆర్.వెంకటాపూర్, ధర్మారం గ్రామాలలో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవాళ గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు వీధివీధినా తిరుగుతూ పారిశుధ్య కార్మికులతో పనులు చేయించారు.
పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలియతిరిగి గ్రామంలోని ప్రధాన వీధులను, మురికి కాలువలను శుభ్రం చేయించారు. చెత్తను సేకరించి చెత్త ట్రాక్టర్ ద్వారా డంపుయార్డ్కు తరలించారు.
గ్రామాలను కాలుష్యంలేని గ్రామాలుగా తయారు చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు శ్యామల, పద్మ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం