Panchayat Elections | శివ్వంపేట, డిసెంబర్ : శివ్వంపేట మండలంలో మూడవ విడుత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. అభ్యర్థులు బుధవారం ఉదయం నుంచి వారి అనుచరులతో కలిసి మండల కేంద్రానికి తరలివచ్చి నామినేషన్లను దాఖలు చేస్తున్నారు.
శివ్వంపేట మండలంలోని మొత్తం 37 గ్రామపంచాయతీలు, 312 వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు, అధికారులు బందోబస్తు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ.. అన్ని నామినేషన్ ప్రక్రియలు పారదర్శకంగా, శాంతియుతంగా జరుగుతున్నాయని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయబడ్డాయని తెలిపారు.
Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా