రామాయంపేట, జూలై 09 : బీఆర్ఎస్ కార్యకర్తలపై నోరెత్తితే దాడులు చేయడం, లేకుంటే కేసులు నమోదు చేయడం ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి, ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కూడా కాలేదు అప్పుడే నోరుజారడం తగదని ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అద్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. బుధవారం రామాయంపేటకు విచ్చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం కార్యకర్తలను పరామర్శించి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇష్టారీతిగా మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు ఊరుకునే వారు లేరని మాటకు మాటలు గాకుండా తమ సత్తాను చాటుతామన్నారు. మా కార్యకర్తల జోలికి వస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. మా కార్యకర్తలకు నేనున్నా ఎలాంటి వాటికైనా నేను సిద్దమే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా చీటికి మాటికి నోరుజారడం, కేసులు నమోదు చేసే పద్దతిని ఇకనైనా మానుకోవాలని మండి పడ్డారు.
ఈ విషయమై రామాయంపేట పోలీసులతో మాట్లాడారు. అక్కడి నుండి నేరుగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట రామాయం పేట పురపాలిక మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ సర్పంచ్‌లు సుభాష్, స్వామి, ఎస్కే. హైమద్, అస్నొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు సుభాష్, ఉమా మహేష్, చంద్రపు కొండల్‌రెడ్డి, ఐలయ్య, నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్ సాగర్,తదితరులు ఉన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం