Padma Devender Reddy | మెదక్ రూరల్, డిసెంబర్ 16 : మెదక్ మండలం చిట్యాల మాజీ సర్పంచ్ పట్లోరి వెంకటేశం తల్లి పట్లోరి లలిత సోమవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి చేరుకొని పట్లోరి లలిత భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ సర్పంచ్ వెంకటేశంను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ,మనోధైర్యాన్ని అందించారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ తల్లి లలిత అనాగోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరం అని అన్నారు. అదేవిధంగా పెరూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రామన్నగారి శేఖర్ తండ్రి రామన్నగారి. పోచయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం పెరూర్ గ్రామం చేరుకొని పోచయ్య చిత్ర పటానికి పూలమాలలతో నివాళులర్పించారు.
శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. వీరి వెంట మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు ఎం ఆంజ గౌడ్ ,మాజీ ఎంపీపీ కొత్తపల్లి కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ యాదగిరి, నాయకులు రామచంద్రా రెడ్డి, యాదా గౌడ్, యాదగిరి, ఏగొండ తదితరులు ఉన్నారు.

45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల