Padma Devender Reddy | మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ముంపు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద గాంధారిపల్లి, కొత్తపల్లి, కుర్తివాడ, ఆరెపల్లి, ముద్దాపూర్ , మిన్ పూర్ , గ్రామాలలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పర్యటిస్తూ అకాల వర్షాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పర్యటించకుండా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. రైతు పంట పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు రప్పలు చేరి అపార నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంజీరా నది పరిహార ప్రాంత గ్రామాల్లో నాలుగు రోజులుగా పంటలు నీట మునిగే ఉన్నాయని అన్నారు. ఘనపురం ఆనకట్ట నుండి ఎఫ్యన్ కెనాల్ ద్వారా పాపన్నపేట్ మండల రైతులకు సాగునీరు వస్తుందన్నారు.
కుర్తివాడలో 800 ఎకరాల్లో పంట పొలాలు..
కొత్తపల్లి గ్రామం వద్ద ఎఫ్ఎన్ కెనాల్ రాతి కటకం తెగిపోయి రైతుల పొలాల్లోకి ఇసుక చేరి మేటలు పెట్టిందన్నారు. ఎఫ్ఎం కెనాల్ నైజాం కాలంలో రాతి కటకం ద్వారా కట్టారన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతిగా రావడంతో ఎఫ్ఎన్ఎన్ ఎఫ్ కెనాల్ తెగిపోయి రైతుల 60 ఎకరాల పంట పొలాలకు ఇసుక మేటలు పెట్టాయి దీనివలన రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. కుర్తివాడలో 800 ఎకరాల్లో పూర్తిగా రైతుల పంట పొలాలు నీటి మునిగి నేల పాలైంది అన్నారు.
ఇప్పటివరకు ఇక్కడికి ఒక అధికారి కూడా రాలేదని, కనీసం ఇరిగేషన్ అధికారులు, ఎమ్మార్వో వచ్చి ఫీల్డ్ విజిట్ కూడా చేయలేదని మండిపడ్డారు. అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి రైతులకు ఎంత నష్టం జరిగిందని అడిగే నాథుడే, ప్రజాప్రతినిధులే దిక్కులేరని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు,ఎమ్మార్వో రైతుల పంటలను ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితులను గమనించి ఇంకా ఎక్కువగా వస్తున్న వరదలకు రైతుల పొలాల పంట పొలాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇంత ఘోర పరిస్థితుల్లో ఉన్న రైతులను పంట మునిగి నష్టపోయిన రైతులను జిల్లా అధికారులు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి వెంట మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి,వైస్ చైర్మన్ కిష్ట గౌడ్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ,మాజీ సర్పంచ్ లు జగన్, శ్రీనాథ్, లింగ రెడ్డి, స్రవంతి శ్రీనివాస్ ,సంజీవ రెడ్డి,బద్రి.మల్లేశం నాయకులు సోములు ,దుర్గయ్య ,ఏడుపాయల మాజీ ధర్మకర్తలు శ్రీనివాస్, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
Ear Wax Cleaning | చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Rahul portrait burnt | కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని అపనిందలు.. రాహూల్ గాంధీ చిత్రపటం దహనం
Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన