Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయి గల్లీ గంగపుత్ర సంఘంలో ఆదివారం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది.
Free mega medical camp | కోటగిరి, ఆగస్టు 31 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయి గల్లీ గంగపుత్ర సంఘంలో ఆదివారం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో పలు వ్యాధులకు సంబంధించి వైద్య నిపుణులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, చక్కెర వ్యాధి, థైరాయిడ్ తో పాటు ఇతరాత్ర ఆరోగ్య సమస్యల పైన వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచితంగా మెగా వైద్యం నిర్వహించి వేల రూపాయల విలువ గల మందులను ఉచితంగా పంపిణీ చేయడంతో శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు మోరే కిషన్, తెల్ల రవికుమార్, యువ నాయకుడు మోరే గౌతమ్, సమీర్, చిన్న అరవింద్, అంబటి గంగ ప్రసాద్ గౌడ్, కప్ప సంతోష్, యోగేష్, శంకర్ గౌడ్, నవీన్, రాజు, పాల గంగారాం, అయూబ్, అరుణ్ గౌడ్, హన్మంత్ రావు, సందీప్, నజీర్, మహేష్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

