నర్సాపూర్ : కాంగ్రెస్ పార్టీ ఆటలు సాగడం లేదని నరేంద్ర మోదీ కుటుంబంపై అపనిందలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల అధికార యాత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ప్రధాని తల్లిపై (Narendra Modi Mother ) అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినందుకు నిరసనగా నర్సాపూర్ అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చిత్రపటాన్ని దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం విదేశాలకు తొత్తులుగా ప్రవర్తిస్తుందని ఎద్దేవా చేశారు. అబద్దాలతో గద్దెనెక్కాలని రాహుల్ గాంధీ చూస్తున్నాడని మండిపడ్డారు. అనంతరం బీజేవైఎం నాయకులు వాళ్దాస్ అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీది ఇటాలియన్ పరిపాలన అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్ , జిల్లా కార్యదర్శి బాలరాజు, మాజీ కౌన్సిలర్లు గోడ రాజేందర్, ఎరుకల యాదగిరి, రమేష్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ,జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు చంద్రయ్య, నర్సాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు నీలి నాగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘసాని రాజు తదితరులు పాల్గొన్నారు.