Padma devender reddy | ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రం మెదక్ లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ నియోజక వర్గ ఇంచార్జి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్లు మల్లికార్జున్ గౌడ్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి దీక్షా దివస్ రోజు నిర్వహించే కార్యక్రమాల గురించి నాయకులతో కలిసి చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరైందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం మెడలు వంచిండన్నారు. ఆ దీక్షతోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అందుకే ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అన్నారు.
దీక్షాదివస్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. దీక్షాదివస్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు జిల్లాలోని మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ, జెడ్పిటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మండలాల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పీఏసీఎస్, చైర్మన్ హన్మంత్ రెడ్డి, పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్, హవేలీ ఘనపూర్,శంకరంపేట ఆర్ పాపన్నపేట మండల పార్టీల అధ్యక్షులు అంజ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాజు,.విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ పట్టణ పార్టీ కో కన్వీనర్లు లింగారెడ్డి, జుబేర్ అహ్మద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త