Paddy grain | మెదక్ రూరల్, అక్టోబర్ 30 : తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మెదక్ మండల మాజీ రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు కిష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మెదక్ మండలంలో మక్త భూపతిపూర్, శివాయ పల్లి, మల్కాపూర్ గ్రామంలోని రైతులు ఆరబోసిన ధాన్యం, కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం నీళ్లలో మునిగిపోవడం, ధాన్యం తడిసిపోయి మొలకెత్తాయి. వరి ధాన్యం వర్షానికి దెబ్బ తినడంతో రైతులకు కన్నీళ్లను మిగిల్చిందని.. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంట నష్టం వివరాలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, పలువురు రైతులు ఉన్నారు.


Hot Fish Curry: భార్య ముఖంపై వేడి చేపకూర చల్లిన భర్త
Quality Seeds | నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి .. రైతులకు అవగాహన