MLA Sunitha lakshma Reddy | వ్యాపార రంగాలలో నర్సాపూర్ మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం నర్సాపూర్ మున్సిపాలిటీలో మహా బాస్కెట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సాపూర్ పట్టణంలో ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మడం శుభసూచకమన్నారు.
పిండి, నూనె, మసాలాలు, పప్పులు తదితర వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి అమ్మడం మూలంగా ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్స్ ప్రొద్దుటూరు శ్రీహరీష్ , వెంకట్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, విట్టల్ గుప్తా, జగదీష్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Woman Molest | వివాహితపై పోలీసుల అఘాయిత్యం.. కేసు నమోదు
Mulugu | ములుగు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం..
KCR | కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు : కేసీఆర్