Woman Molest | అమరావతి : ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) చిత్తూరు జిల్లా( Chittoor ) పలమనేరు పోలీసు స్టేషన్ పరిధిలో ఓ వివాహిత( Woman )పై పోలీసులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై డీఎస్పీ సీరియస్‌గా స్పందించి.. కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డుపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి ఓ వివాహిత పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో హోంగార్డు ఆమె ఫోన్ నంబర్ తీసుకొని మానసికంగా వేధించినట్లు బాధితురాలు వాపోయింది. హోంగార్డు వేధింపులు తట్టుకోలేక బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్‌ను సాయం అడగ్గా, అతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వివాహిత తెలిపింది. హోంగార్డు, కానిస్టేబుల్ వేధింపులు భరించలేక.. పోలీసు ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. హోంగార్డుతో పాటు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశామని డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు.