Open School | పాపన్నపేట, ఆగస్టు 23 : చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఎంతో మేలు చేస్తుందని పాపన్నపేట మండల విద్యాధికారి (ఎంఈఓ) ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రోజు ఆయన పాపన్నపేట కాంప్లెక్స్ హెచ్ఎం మహేశ్వర్, ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ రియాజ్‌తో కలిసి ఓపెన్ స్కూల్ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు రెగ్యులర్ స్కూల్ సర్టిఫికెట్లతో సమానమని వెల్లడించారు. ఈ నెల 31 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఫీజు గడువు ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, విశ్వనాథం, సుభాష్ , మహమూద్ తదితరులున్నారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో