MLA Sunitha lakshma reddy | శివ్వంపేట, ఆగస్టు 24 : దేశానికి అన్నం పెట్టే రైతును అడుక్కునే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుస్తుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం మండల కేంద్రమైన శివ్వంపేటలో మబ్బుల నుంచి యూరియా కోసం ఇటుకలు, చెప్పులు క్యూలైన్లో పెట్టి అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులతో అక్కడే నర్సాపూర్, తూప్రాన్ ప్రధాన రహదారిపై ధర్నాకు ఉపక్రమించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మార్పు రావాలి అంటూ ప్రచారం చేసి తీరా పాత రోజులలోకి నెట్టి వేసిందన్నారు. ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు వేసుకుంటే యూరియా సరఫరా లేక పనులన్నీ మానుకొని రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ఒక్క రైతుకు ఒక్క యూరియా సంచి ఇస్తే పంట దిగుబడి ఏవిధంగా వస్తుందని అన్నారు. రైతులు ఎన్ని అవస్థలు పడుతున్నా కనీస వసతులు మంచినీరు సైతం ఇచ్చేవారు కరువయ్యారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరైన సమయానికి ఎరువులు యూరియాను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేక కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి వేయడం, బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టివేయడం వారికి పరిపాటిగా మారిపోయిందన్నారు.
అంతకుముందు అధికారులతో మాట్లాడి మరో రెండు లోడ్ల యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని లేని పక్షంలో యూరియా వచ్చేవరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, రైతులు ఉన్నారు.
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?