Mission Bhagiratha Leakage | నర్సాపూర్, సెప్టెంబర్ 22 : గత మూడు నెలలుగా మిషన్ భగీరథ నీరు లీక్ అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా పట్టించుకొని మరమ్మత్తులు చేయించండి సార్ అంటూ కాలనీవాసులు గోడును వెల్లబోసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో నర్సాపూర్- సంగారెడ్డి రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యి మూడు నెలలు కావొస్తుంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ సమస్య గురించి గతంలో మున్సిపల్ కమిషనర్‌కు, సిబ్బందికి మొర పెట్టుకున్నా ఇప్పటి వరకు మరమ్మత్తులు చేయించలేదని కాలనీ వాసులు వాపోయారు. ఈ లీకేజీతో త్రాగునీరు వృథాగా పోవడమే కాకుండా నీరు కలుషితం అవుతున్నాయని అన్నారు.
ఉదయం నల్లాలు వచ్చే సమయంలో ఈ నీరు మరింత ఉధృతంగా బయటకు వస్తుందని, వృధాగా పోతున్న నీటితో అర ఎకరం పొలాన్ని పారపెట్టవచ్చని కాలనీవాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయించి మంచి నీరును అందించాలని కాలనీ వాసులు విజప్తి చేశారు.
Stray dogs | పెద్దపొర్ల గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం.. పలువురికి గాయాలు
Medical Seat | నీట్ యూజీ పరీక్షలో ఆటో డ్రైవర్ కూతురికి మెడికల్ సీట్