అచ్చంపేట రూరల్ : ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం ( ANMs ) లకు ఏడు నెలల జీతాలు (Pending salaries) వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పట్టణంలోని టీఎన్జీవో భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు గత ఏడు నెలల నుంచి వేతనాలు లేక పస్తులుంటున్నారని ఉంటున్నారని వెల్లడించారు.
తెలంగాణలోని 650 మంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్స్ వసతి గృహాలలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఎనిమిది ఏళ్ల క్రితం ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు . ఇప్పటికైనా హాస్టల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్, డైలీ వైస్ వర్కర్స్ యూనియన్ నాయకులు భరత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మల్లేష్, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శివ, ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలు నాగమణి ,లలిత, కవిత, అనిత, రుక్మిణి, రాధిక, తదితరులు పాల్గొన్నారు.