మాగనూరు : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సాధారణ ఆటో డ్రైవర్ కూతురు నందిని ఎంబీబీఎస్ సీట్ ( Medical seat ) సాధించింది. మాగనూరు మండల కేంద్రానికి ఆటో డ్రైవర్ దండు బసవరాజ్ కూతురు నందిని( Nandini ) 2025 మే 5వ తేదీన నీట్ యూజీ పరీక్ష రాయడంతో జూన్ 14వ తేదీన వెలువడిన ఫలితాలలో 720 మార్కులకు గాను 452 మార్కులు సాధించింది .
ఆల్ ఇండియా 1,13,751 ర్యాంకుతో ప్రతిభ కనపరిచి జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరిలో ఎంబీబీఎస్ సీట్ సాధించింది . ఎంబీబీఎస్ సీట్ సాధించిన నందిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మండల నాయకులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేసి అభినందించారు.