Officers | మెదక్ రూరల్, నవంబర్ 01 : అధికారుల కోసం ఆఫీసుకు వెళ్తే ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. ఏ అధికారి ఎప్పుడెప్పుడొస్తారోనని పడిగాపులు కాస్తున్నారు రైతులు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో మెదక్ సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
శనివారం 11 గంటలైన అధికారులు రాకపోవడంతో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరు ఎప్పుడు వస్తారో వారికే తెలియదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నట్టు విమర్శలు వెల్లుత్తున్నాయి. వ్యవసాయ ఉద్యోగులు, రాక కోసం రైతులు పడిగాపులు పడి ఇంటి బాట పడుతున్నారు.
కార్యాలయంలో రైతులు సిబ్బందిని అడిగితే అధికారులు ఫీల్డ్ మీద ఉన్నారని చెప్పడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సిబ్బంది సకాలంలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


Actress | భిక్షాటనతో జీవనాన్ని సాగిస్తున్న నటి.. కంటతడి పెట్టిస్తున్న నుపుర్ అలంకార్ కథ
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో మరో ట్విస్ట్ .. శ్రీజ ఎలిమినేషన్, కొత్త కెప్టెన్గా దివ్య!
NTR | గాయాల నుండి పూర్తిగా కోలుకున్నఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ భారీ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..!