Religious Activities | మెదక్, జులై 19 (నమస్తే తెలంగాణ) : భారత రాజ్యాంగ భావజాలానికి విరుద్దంగా ప్రభుత్వ విద్యాలయాల్లో మత ప్రచార కార్యక్రమాలకు తావులేదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కే లక్ష్మినారాయణ అన్నారు. మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్ బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో గిరిజన టీచర్ డాక్టర్ నరేందర్ నాయక్‌పై దాడి చేసిన బీజేవైఎం దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పాఠశాలలోకి మనువాదుల చొరబాటును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత గిరిజన, బహుజన, మైనారిటీ సంఘాల అధ్వర్యంలో శనివారం మెదక్‌లోని టీఎన్జీవో భవన్లో సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ప్రొఫెసర్ కే లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. పథకం ప్రకారం దళిత, గిరిజన, బహుజన, మైనారిటీలపై దాడులు పెరిగిపొతున్నాయన్నారు. డీఈఓ విచారణ చేయకుండా గిరిజన టిచర్‌కు ఇచ్చిన నోటిసులు ఉపసంహరించుకోవాలన్నారు. జాతీయ విద్యావిధానం పేరుతో మనువాదాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు.
టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కోటగిరి తెలుగు పండిట్ మల్లికార్జున్‌పై, తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై, బూర్గపల్లి నరేందర్ నాయక్‌పై, యలాల్ ఉపాధ్యాయురాలు కాశీం బాయిపై దాడులు చేశారన్నారు. విద్యాలయాలలో ప్రార్థన చేయడానికి కోడ్‌ను జారీ చేయాలన్నారు. పాఠశాలలో లౌకికవాద వాతావరణాన్ని పెంపొందించాలన్నారు.
ఈ సదస్సులో సీనియర్ దళిత నాయకులు రామస్వామి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అహ్మద్, లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు దాస్ రామ్ నాయక్, జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామాల అశోక్, నాయకులు పెంటన్న, ఎమ్మార్పీఎస్ నాయకులు బాల్ రాజు, సామెల్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి దయాసాగర్, మిల్లి అధ్యక్షుడు ఉమర్ ఖాన్, జావిద్ మౌలానా, డాక్టర్ సూఫి ఆలీ, వివిధ సంఘాల నాయకులు ప్రకాశ్ రాథోడ్, రాధాకృష్ణ, న్యాయవాది దివాకర్, ఇస్సాక్, అమ్జద్ తదితరులు పాల్గొన్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత