Panchayat governing bodie | మెదక్ రూరల్, డిసెంబర్ 22 : మెదక్ మండలంలోని గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు కొలువు తీరాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ , కార్యదర్శులు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో గ్రామ పంచాయతీలు సందడిగా మారాయి.
మాచవరం గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ సాంబశివరావు పాలకవర్గం ఉప సర్పంచ్ , వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు. సర్పంచ్ సాంబశివరావు మాట్లాడుతూ.. గ్రామస్తులు తమపై నమ్మకంతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
Mysaa | అగ్రెసివ్‌గా రష్మిక మందన్నా.. మైసా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది
Bala Krishna | నార్త్ మార్కెట్లో ఆశలు నెరవేరవా.. బాలకృష్ణకి కూడా నిరాశే ఎదురైందా?