Heart attack | కొల్చారం : కాళ్ల పారాణి ఆరక ముందే నవ వరుడు గుండె పోటుతో మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా అంసాన్ పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కమొల్ల పెద్ద వెంకట్- లక్ష్మీ దంపతుల కుమారుడు అక్కమొల్ల సాయికిరణ్ 19 (అలియాస్ చింటు)కు గత నెల 21న అంసాన్ పల్లి గ్రామానికి చెందిన గోల్ఫల శేఖర్- రుక్కమ్మ కూతురు అనూషతో వివాహం జరిగింది.
అయితే సాయికిరణ్ గత రాత్రి గ్రామంలో ఓ వివాహానికి బ్యాండ్ కొట్టడానికి వెళ్లి ఉదయం ఇంటికి వచ్చాడు. అనంతరం సాయికిరణ్ స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు. కండ్ల ముందే సాయికిరణ్ కుప్పకూలిపోయి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
పెళ్లయిన రెండు వారాల్లోనే సాయికిరణ్ చిన్న వయస్సులో గుండె పోటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు పెయింటర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా