హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఫెలోఫార్మర్-2026 పురస్కారం రైతునేస్తం ఎడిటర్, పద్మశ్రీ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావుకి లభించింది. బుధవారం న్యూఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నిర్వహించిన కృషి విజ్ఞాన్ మేళాలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మిల్లెట్స్ ప్రాసెసింగ్, అదనపు విలువల జోడింపు గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.