జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై సర్కార్‌ను నిలదీస్తామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న రిటైర్డ్ డీడబ్ల్యూవో చిన్నయ్యను బుధవారం హనుమకొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు. జయశంకర్ భూపాలపల్లిలో చిన్నయ్య జిల్లా సంక్షేమ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పేగు క్యాన్సర్‌తో బాధపడుతూ తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ పలుమార్లు వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం, అధికారుల దృష్టికి తెచ్చింది.