Delhi: మెర్సిడీజ్ ఢీకొట్టడంతో 70 ఏళ్ల వృద్ధ మహిళ మృతి
Delhi: వాగన్ఆర్ కారును మెర్సిడీజ్ ఢీకొన్న ఘటనలో 70 ఏళ్ల వృద్ధ మహిళ చనిపోయింది. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఉన్న హిమాలయాస్ అపార్ట్‌మెట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మెర్సిడీజ్ కారు డ్రైవర్ తండ్రి.. హర్యానా పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆ కారు నుంచి ఓ బీర్ బాటిల్‌ను రికవరీ చేశారు.
న్యూఢిల్లీ: వాగన్ఆర్ కారును మెర్సిడీజ్ ఢీకొన్న ఘటనలో 70 ఏళ్ల వృద్ధ మహిళ చనిపోయింది. ఢిల్లీ(Delhi)లోని నరేలా ప్రాంతంలో ఉన్న హిమాలయాస్ అపార్ట్‌మెట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతురాలిని ఊర్మిళగా గుర్తించారు. మాముర్పుర్ ఆమె స్వంత నివాసం. రెండు వాహనాల మధ్య ఆమె ట్రాప్ అయినట్లు తెలిసింది. ప్రమాద స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. వాగన్ఆర్ నడుపుతున్న డ్రైవర్ ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇక మెర్సిడీజ్ కారు డ్రైవ్ చేస్తున్న శుభమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా పోలీసు శాఖలో అతని తండ్రి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. మెర్సిడీజ్ కారు నుంచి ఓ బీర్ బాటిల్‌ను రికవరీ చేశారు. మద్యం మత్తులో శుభమ్ కారును డ్రైవ్ చేసినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు దారి తీసిన అంశాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ కేసును నమోదు చేశారు. ఊర్మిళ మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌కు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

